ప్రజాశక్తి - క్యాంపస్ : సాధారణంగా చిన్నపిల్లలు వేలమందిలో, లక్షలమందిలో ఏ ఒక్కరో, ఇద్దరో అసాధారణ ప్రతిభను కలిగి ఉంటారు. అదేకోవకే తిరుపతికి చెందిన హరిపురం కాలనీలోని తారకరామ నగర్ కు చెందిన డాక్టర్ కొణిదెల క్రాంతి కుమార్ డాక్టర్ బొమ్ము ఉమాదేవి ఏకైక కుమారుడు రిశ్వాన్ క్రాంతి ఏకసంతాగ్రహిగా పేరుగాంచాడు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు చెబుతున్న అనేక అంశాలను గుర్తిస్తూ ఒక్కసారికే గుర్తుకు పెట్టుకుని పదేపదే వస్తువును అంకెలను చెప్పడం నేర్చుకున్నాడు. సాధారణంగా చిన్నపిల్లలు రెండేళ్ల వయసులో ప్రస్తుత కాలంలో చరవాణిలోని బొమ్మలు, సినిమాలు, డిస్నీ మ్యాప్ వంటివి చూస్తుంటారు, కానీ తల్లిదండ్రులు చెప్పే ప్రతి చిన్న విషయాన్ని ఏకాగ్రతతో తన మెదడుకు పని పెట్టాడు. కొణిదెల రిశ్వంత్ క్రాంతి తల్లిదండ్రులు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బయలాజికల్ సైన్స్ లో బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో పీహెచ్డీలు పూర్తి చేశారు. తండ్రి క్రాంతి కుమార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్సి గుర్తించబడిన ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ ను సాధించి బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగం, జువాలజీ లో పరిశోధకులుగా పనిచేస్తున్నారు. చిన్నప్పటినుంచి చిన్నారి రిశ్వాన్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని పదేపదే చెప్పేవాడని అన్నారు. చిన్నారి ఆసక్తిని గుర్తించిన తల్లి బాబుకి 20 జంతువుల పేర్లు, 20 పక్షుల పేర్లు, 12 దేశాల జాతీయ చిహ్నాలు, 16 యాప్ లు, 11 రంగులు, 11 పండ్లు, 11 కూరగాయలు, 8 ఆకారాలు, 22 శరీర భాగాలు, 27 మంది భారతీయ స్వాతంత్ర సమరయోధులు, 23 దేశాల జండాల గురించి, 27 ఖగోళ వస్తువులను, 27 ప్రసిద్ధ ప్రదేశాలను, 22 భారతీయ రాష్ట్రాలను గుర్తించేలా సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. చిన్నారి రిశ్వాన్ 26 అక్షరమాల పదాలను, 13 హిందీ అక్షరాలను ఏడు ఖండాల పేర్లను, ఒకటి నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించేలా శిక్షణ ఇవ్వడం జరిగిందని తల్లిదండ్రులు వెల్లడించారు. చిన్నారి యొక్క వీడియోలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపించడం జరిగిందని, అతని ప్రతిభను గుర్తించి ఆన్లైన్లో మరొకసారి అతనిని పరీక్షించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పించారని వెల్లడించారు. అందుకు సంబంధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రత్యేకంగా కొణిదల రిశ్వాన్ క్రాంతి యొక్క ప్రశంసా పత్రాన్ని మరియు గోల్డ్ మెడల్ ను, అతని ప్రతిభకు సంబంధించిన ప్రత్యేకమైన 2023 కు సంబంధించిన ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డ్ పుస్తకాన్ని ఇంటికి పంపడం జరిగిందన్నారు. రిశ్వాన్ క్రాంతి చిన్న వయసులో ఇటువంటి ఘనత సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు వారి యొక్క బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.










