- ఆదోని పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన కోట్ల
- ఆదోని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లను పరామర్శించిన కోట్ల
ప్రజాశక్తి-ఆదోని:- ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొని తమ నేతలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసుర్య ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు మదిరే భాస్కర్ రెడ్డి దేవేంద్రప్పలను వారి గ్రామాలు మదిరే, పెద్ద హరివనం వెళ్లి పరామర్శించారు. ఆదోని టూ టౌన్ పోలీసులు వారిని కొట్టడంపై తీవ్రంగా ఖండించారు. మదిరే గ్రామంలోని భాస్కర్ రెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ తెదేపా నాయకులు తమ అధినేత చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా జైలుకు పంపడాన్ని నిరసిస్తూ వివిధ రీతులలో నిరసన తెలుపుతున్న తమవారిపై పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి పిలిపించుకొని సీఐ బూటు కాలుతో తన్నడం చట్ట విరుద్ధమన్నారు. వైసిపి నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంతమందిని అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. స్వాతంత్ర దేశంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని గుర్తించుకోవాలని అన్నారు. అవినీతిపరుడైన జగన్ 30 కేసులలో ఉంటూ బెయిల్ పై పదేళ్లుగా బయట ఉన్నారన్నారు మచ్చలేని తమ అధినేత చంద్రబాబుపై కక్షపూరితంగా తాను జైలుకు వెళ్లానని జగన్ చంద్రబాబు నాయుడుపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు. బిజెపి ప్రోద్దలంతోనే అక్రమంగా కేసులో ఇరికించి జైలుకు పంపారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు తమ ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు ఇప్పుడు వారి ఆస్తులు ఎంత సంపాదించుకున్నారో దానిపై తేల్చాలన్నారు. దోచుకోవడం దాచుకోవడం లోనే వైసీపీ ఉందని ఎక్కడ చూసినా మైనింగ్ ,శాండ్, మద్యం లో అక్రమాలకు పాల్పడి దోచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇంకా అద్వానమైన పాలన ఎక్కడ చూడలేదన్నారు అభివృద్ధి ,నిరుద్యోగ యువతకు ఉపాధి లేదు కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదన్నారు. నిరుద్యోగులు విద్యార్థుల భవిష్యత్తును జగన్ నాశనం చేశారని అన్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రపంచంలోని గుర్తింపు తెచ్చుకున్న నేత అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు రాబోయే రోజుల్లో కచ్చితంగా అధికారంలోకొస్తామని దీమా వ్యక్తం చేశారు. మాపై ఎవరైతే పోలీసులు కేసులు దాడులు చేశారో గుర్తుంచుకుంటామని వారిని వదిలే ప్రసక్యలేదని అన్నారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలో బయటికి వస్తారని అన్నారు. సీనియర్ నాయకుడు రామచంద్ర మాట్లాడుతూ సూరం భాస్కర్ రెడ్డి , దేవేంద్రప్ప మరి కొంతమందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి లోపల వేయాలంటూ పోలీసులు భయపెడుతున్నారని అన్నారు. రాజకీయంగా అనుకుదొక్కేందుకు రెండు పార్టీలు కలిసి కుట్రా చేస్తున్నారన్నారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించి కేసులు పెడతామని భయపెట్టడం ఏమిటని సూరం భాస్కర్ రెడ్డి మాన్వి దేవేంద్రప్ప ఆరోపించారు రాజకీయంగా అనగదొక్కెందుకే పోలీసులు ఈ ద్చర్యపాల్పడ్డారని ఆరోపించారు ఇలాంటి వాటికి భయపడమన్నారు. సమావేశంలో సూరం భాస్కర్ రెడ్డి, సౌదీ రావుఫ్, రామచంద్ర, ఫక్రుద్దీన్, సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.










