Sep 27,2023 16:58

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : మాజీ ముఖ్యమంత్రివర్యులు, దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 22వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నీలకంఠప్ప ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు కేసీ కెనాల్ ఎల్ ఎల్ సి ఆధునీకరణ పనులకు వందల కోట్ల రూపాయలు మంజూరుకు కృషి చేసిన వ్యక్తి కోట్ల అని ఆయన పేర్కొన్నారు. రైతులకు 50 రూపాయలకే విద్యుత్తు అందించడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టి మహిళల ఆత్మగౌరవం కోసం ఏకంగా మద్యపానాన్ని నిషేధించి డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళల ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ దిలీప్ దోక, పార్టీ సెక్రెటరీ సాయినాథ్ యూత్ కాంగ్రెస్  దేవిశెట్టి వీరేష్ శ్రీనిత్, నిస్సార్ అహ్మద్ మద్దిలేటి, రాము పాల్గొన్నారు.