Apr 21,2023 16:24

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యంగా తయారు చేశారు.రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోంది. పండించిన ధాన్యాన్ని కొనకుండా రైతులను అనాధలుగా తయారు చేస్తుందని మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. శుక్రవారం మచిలీపట్నం మండలం చిన్నాపురం  గ్రామంలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనక నష్టపోతున్న రైతులతో  సమావేశమై ధాన్యాన్ని పరిశీలించి ప్రస్తుతం  ప్రభుత్వ విధానాలతో రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో వారినీ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షులు గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ సభ్యులు కాగిత వెంకటేశ్వరరావు, కుంచె నాని, కాగిత గోపాల్ రావు, మరియు చిన్నాపురం గ్రామ రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.