ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ ఖలీలన్ని భర్తీ చేస్తామని నిరుద్యోగ యువత ఓట్లు దండుకుని ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు జాబ్ కాలెండర్ ఎందుకు ప్రకటించలేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటు చూసినా నిరుద్యోగ యువత ఆర్తనాదాలే వినపడుతున్నయన్నారు. 2019 ఎన్నికల ముందు 2 . 30 లక్షల ఉద్యోగాలను, ప్రతి ఈటా జనవరి 1న జాబ్ కేలెండర్ విడదల చేస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు చేతకాక పరదాలు అడ్డుపెట్టుకుని తిరుగుతున్నడని విమర్శించారు.ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం చేతకాని జగన్మోహన్ రెడ్డి కనీసం నూతన పరిశ్రమలనైనా తెచ్చి వాటి ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలనైన ఇస్తాడనుకున్న యువతకు కొత్త పరిశ్రమల తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తన అధికార బలంతో పక్క రాష్ట్రాలకు తరిమివేసి యువత భవితను ప్రశ్నార్ధకంగా మార్చాడన్నారు. ఉపాధి ఉద్యోగాలు లేక రాష్ట్రంలో 21,570 మంది యువత ఆత్మహత్యకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి చెప్పడని గుర్తు చేశారు.అలాగే ఆంధ్ర రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా గురించి నాడు ఎన్నికల ప్రచారంలో 25 ఎంపీల స్థానాలకు 25 ఇస్తే కేంద్ర మెడలో మంచి ప్రత్యేక హోదా తీసుకువస్తా యువతకు ఉద్యోగాలు సృష్టిస్తనని చెప్పి ఇప్పుడు తన బాబాయి వివేకానంద హత్య కేసు తన మీద రాకుండా చూసుకోవడం కోసం కేంద్రం ముందు మెడలు వంచుతున్నడని విమర్శించారు.
అన్ని విధాలుగా నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి అక్రమంగా గంజాయి డ్రగ్స్ మద్యం వంటి వాటిని తీసుకువచ్చి రాష్ట్రంలోని యువత జీవితాలపై దెబ్బ కొట్టాడ న్నారు.నాటి టిడిపి ప్రభుత్వం అమరావతి నిర్మాణం ద్వారా 15 లక్షల ఉద్యోగాలు కల్పన స్వీకారం చుడితే నేడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనే మూడు ముక్కలాట ద్వారా వాటి నిర్వీర్యం చేసి యువత ఉపాధికి గండి కొట్టారన్నారు.అదేవిధంగా టిడిపి హయాంలో రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి 18 వేల ఉద్యోగాలు ఇచ్చాం కానీ ప్రతి ఏటా మెగా డీఎస్సీ అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయారన్నారు. ఇప్పటికైనా జగన్ యువతను మోసం చేయడం మానేసి వెంటనే ఉద్యోగాల భర్తీ కొరకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. వీటిలో 4లక్షల కోట్లు పథకాలకు ఇచ్చాం అని చెబుతున్నారని మిగిలిన 6 లక్షల కోట్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2019 బందరు పోర్టు నవయుగ కు అప్పగించి పనులు మొదలు పెట్టారు, మీరు రాగానే ఆ పనులు క్యాన్సిల్ చేశారు. పనులు కొనసాగించి వుంటే ఇప్పుడు యువతకు ఉద్యోగాలు వచ్చేవి కాదా అని గుర్తు చేశారు. నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే ఒక బెర్త్ కడతాం, రెండు బెర్త్ కడతాం అని నాటకాలు ఆడుతున్నరన్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, అక్రమ కేసులు పెడతారన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు పేరుతో సిఆర్ జెడ్ పరిధిలోని మట్టిని అక్రమంగా తరలస్తున్నరని అడ్డుకునే నాధులే లేరన్నారు. దీనిపై మేము అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకుని పాపాన పోలేదన్నారు. దొచేస్తున్న ఈ మట్టి మాఫియాను, ఆ మాఫియాకు సహాయం చేస్తున్న అధికారులను వదిలి పెట్టం అని మొత్తం సమాచారం మవద్ద వుందని, అధికారంలోకి రాగానే అందరినీ చట్టం ముందు నిలబెడతం అని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి బాబా ప్రసాద్, పార్టీ నాయకులు గోపీచంద్, ఇలియాస్ పాషా, కార్పొరేటర్ లు పాల్గొన్నారు.










