Oct 20,2023 11:21

కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసమితి పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం కరీంనగర్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీతో జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని తమను రాహుల్ గాంధీ కోరారని తెలిపారు.  రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని దాన్ని అంతమొందించేందుకు కృషి చేయాలని రాహుల్ తెలిపారని అన్నారు. ఈ క్రమంలో పొత్తులపై చర్చలు జరిపామని తెలిపారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్ల కోదండరామ్ సీట్లు అడిగినట్లు సమాచారం. తదుపరి విషయాలు త్వరలో తెలియజేస్తామన్నారు.