ప్రజాశక్తి - మంత్రాలయం
టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎన్ని కుట్రలు చేసినా ఆయన భయపడే వ్యక్తి కాదని, ముఖ్యమంత్రి జగన్‌కు ధైర్యం ఉంటే వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి చూపాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టిడిపి మండల అధ్యక్షులు పన్నగ స్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం రాక్షస పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్ని డ్రామాలాడిన ప్రజలు జగన్మోహన్‌రెడ్డి నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. రానున్నది టిడిపి ప్రభుత్వమని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, గోపాల్ స్వామి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, ధని, క్లస్టర్ ఇన్‌ఛార్జీలు అడివప్ప గౌడ్, వెంకటపతి రాజు, కోట్రేష్ గౌడ్, ఎల్లారెడ్డి, చావిడి వెంకటేష్, బాబురావు, జ్ఞానేష్, భరద్వాజ్ శేట్ట, కృష్ణారెడ్డి, పెద్దకడబూరు మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, బీసీ సెల్ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అశోక రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, ఆర్‌టిఎస్ కన్వీనర్ దశరథ రాముడు, తెలుగు యువత నాడిగేని మహదేవ్, మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు టిప్పు సుల్తాన్, ఉసేని, అబ్దుల్, వట్టేప్ప గారి నరసింహులు, మేకల నరసింహులు, ఎంపిటిసి వెంకటేష్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఏబు, రాజాబాబు, బొగ్గుల నరసన్న, వీరేష్, శివ పాల్గొన్నారు. టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి, మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామిలు నిమ్మరసం ఇచ్చి సామూహిక నిరాహార దీక్ష విరమింపజేశారు.
దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న తిక్కారెడ్డి










