పూజలు చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ దంపతులు
ప్రజాశక్తి - కురుపాం : దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని కురుపాం కోట వద్ద కేంద్ర మాజీ మంత్రి వైరచర్ల కిషోర్ చంద్రదేవ్ దంపతులు ఆదివారం కోటలో ఖడ్గ దుర్గతల్లిని వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ అనువంశిక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దసరాకు తొమ్మిది రోజులు ముందు నుంచి నవరాత్రులు జరుగుతాయని ఈ నవరాత్రులు జరిగే సమయంలో కోటలో భక్తులు సౌకర్యార్ధం తలుపులు తెరిచి ఉంటాయని, కావున కురుపాం చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు దుర్గ తల్లిని దర్శించుకోవడానికి తండొప తండాలుగా వస్తూ దుర్గా తల్లిని దర్శించుకుంటారు.










