కర్నూలు బయల్దేరిన మాదిగలు
ప్రజాశక్తి - కోసిగి
కర్నూలులో ఎపి ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య చేపట్టిన మాదిగల కురుక్షేత్ర మహా సంగ్రామ సభకు బయల్దేరి వెళ్లారు. బుధవారం ఎంఆర్‌పిఎస్ మండల అధ్యక్షులు ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలతో కలిసి బయల్దేరారు. ఈ సందర్భంగా ఎపి ఎంఆర్‌పిఎస్ మండల గౌరవాధ్యక్షులు, గౌరవ సలహాదారులు మాణిక్యరాజు, సొట్టయ్య మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న మాదిగలను ఎబిసిడి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాదిగలపై జరుగుతున్న దాడులను అరికట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎపి ఎంఆర్‌పిఎస్ నాయకులు రాజేష్, ఇర్మియా, నరసింహులు, హనుమంతు, సురేష్, అయ్యప్ప, మల్లేష్, జుమ్మాలదిన్నె పౌలు, హుసేని పాల్గొన్నారు.










