అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి - కదిరి టౌన్ : కుల వివక్ష నిర్మూలనకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని రైతు సంఘం జిల్లా నాయకులు బడా సుబ్బిరెడ్డి పేర్కొన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కదిరిలోని సిపిఎంకార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగన్మోహన్, రామ్మోహన్, కెవిపిఎస్ నారాయణ, ఫాజిల్, మున్సిపల్ యూనియన్ నాయకులు తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.










