కూలిపోయిన ప్రహరీ
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : మండలంలోని ఎంఆర్ నగరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కొంతమేర కూలిపోయింది. పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మంజూరైన అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నారు. గదుల నిర్మాణానికి పునాదుల కోసం తీసిన మట్టిని ప్రహరీకి ఆనుకొని వేశారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు మట్టి నానిపోవడం వల్ల ప్రహరీపై ఒత్తిడి పెరిగి కొద్దిగా కూలిపోయింది. పడిపోయిన గోడను తిరిగి నిర్మిస్తామని తల్లిదండ్రుల కమిటీ సభ్యులు తెలియజేశారు.










