కూలిన పాఠశాల గోడ
తప్పిన పెను ప్రమాదం
ప్రజాశక్తి - బనగానపల్లె
మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో పాఠశాల గోడ కూలిపడి విద్యార్థుల పుస్తకాలు బ్యాగులపై పడింది బుధవారం మండలంలోని హుస్సేనాపురం పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో పాఠశాల గోడ కూలి విద్యార్థుల పుస్తకాలు బ్యాగులపై పడింది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో గోడ కూలడంతో పెను ప్రమాదం తప్పింది పాఠశాలలో 46 మంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు చదువుకునే సమయంలో పాఠశాల గోడ కూలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న అందులోనే తరగతులను బోధిస్తున్నారని తెలిపారు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకపోయి వెళ్ళినా పట్టించుకోలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నాడు నేడు కింద పాఠశాలలను ఎంపిక చేసి లక్షల రూపాయల ఖర్చు చేసి అధునాతన గదులను ప్రహరీ గోడలను నిర్మిస్తుంది అయితే అధికారులకు శిథిలావస్థకు చేరుకున్న హుస్సేనాపురం పాఠశాలను నాడు నేడు కింద ఎంపిక చేయకపోవడం దారుణం అధికారులకు ఈ పాఠశాల దుస్థితి కనిపించక పోవడంతో నాడు నేడు కింద ఎంపిక చేయలేదు మూడో విడత కింద నాడు నేడుకు ఈ పాఠశాలను ఎంపిక చేశారు పనులు మొదలు పెట్టకపోవడంతో శిథిలావస్థలో ఉన్న గదుల్లోనే గత్యంతరం లేక ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాలలోనే భయం భయంగా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని విద్యార్థులు విద్యా బోధన చేస్తున్నారు విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం పుస్తకాలు బ్యాగులను పాఠశాలల్లోనే ఉంచి బయటికి వచ్చి భోజనం చేస్తున్న సమయంలో పాఠశాల గోడ కూలి పడింది దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు విద్యార్థుల పుస్తకాలు బ్యాగులు గోడ కులడంతో చినిగిపోయాయి. ప్రమాదాలు జరిగితే తప్ప అధికారులు స్పందించరా అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి పాఠశాలలను పునర్మించాలని కోరుతున్నారు










