ప్రజాశక్తి-శింగరాయకొండ : ఇంజనీరింగ్ విద్యార్థినులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని తహశీల్దారు సిహెచ్.ఉష తెలిపారు. మలినేని సుశీలమ్మ మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు ఉష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంల్లోని ఇంజినీరింగ్ కళాశాలకు గ్రామీణ ప్రాంతం నుంచే ఎక్కువ మంది విద్యార్థినులు చదువు కొనేందుకు వస్తున్నట్లు తెలిపారు.ఆ విద్యార్థినులు కష్టపడి చదివితే తర్వాత మంచి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చునని తెలిపారు. విద్యార్థినులు కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి తాము చదివిన కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి విద్యార్థిని కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తే తమ తల్లిదండ్రుల కోరిక కూడా నెరవేర్చిన వారు అవుతారని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎ, గోపాలకష్ణమూర్తి, డైరెక్టర్ జయలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ దీప్తి ప్రసన్న , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాచకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 1










