Sep 08,2023 21:49

మాట్లాడుతున్న మానసిక వైద్యులు డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌

             ప్రజాశక్తి-అనంతపురం     ఎవరూ క్షణికావేశాలకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని మానసిక వైద్యులు డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌ సూచించారు. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని గఫూర్‌ కాలనీలో డాక్టర్‌ కెఎస్‌ఎఆర్‌ గఫూర్‌ ఇన్సిట్యుటూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కరస్పాండెంట్‌ అబ్దుల్‌ రజాక్‌ గఫూర్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎక్కడ చూసినా క్షణకావేశాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు, మారకద్రవ్యాలకు బానిసలుగా మారి ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు మెడికల్‌ సైన్స్‌ విద్యార్థులు కృషి చేయాలన్నారు. డాక్టర్‌ అబ్దుల్‌ రజాక్‌ గఫూర్‌ మాట్లాడుతూ ఎన్నో సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒకసారి తమ పిల్లలు, కుటుంబం గురించి ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయం తీసుకోరన్నారు. మెడికల్‌ కళాశాల ఆదిరెడ్డి పరదేశీనాయుడు మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చిన్న, చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అలాంటి నిర్ణయాలను ఎవరూ తీసుకోవదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌.అర్షద్‌ అయూబ్‌, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.