నీటిలో మునిగిన ఆలయం
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరాలయం
ప్రజాశక్తి - కొత్తపల్లి
గత కొన్ని నెలల నుంచి భక్తుల పూజలు అందుకుంటున్న సంగమేశ్వరుడు ఆదివారం కృష్ణమ్మ ఒడిలోకి మెల్లమెల్లగా చేరుకుంటున్నాడు. శ్రీశైలం జలాశయంకు భారీగా వరదనీరు చేరుతుండడంతో సంగమేశ్వర ఆలయం మునుగుతోంది. ప్రతి సంవత్సరం సుమారు 6 నెలల పాటు కృష్ణానది నీటిలో మునిగి ఉంటుంది సంగమేశ్వర ఆలయం. మరో 6 నెలల పాటు సంగమేశ్వర క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎగువ ఉన్న ఆలయంలో ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో పలు విశేష పూజలు నిర్వహిస్తారు. వచ్చిన భక్తులు దారి వెంట నల్లమలలో ఉన్న పచ్చని చెట్లు, ప్రకృతి కనుచూపుమేరలో కృష్ణమ్మ పరవళ్ళు చూస్తూ కుటుంబ సమేతంగా ఆనందంగా గడుపుతారు. ఆదివారం సంగమేశ్వరాలయం ముఖ మండపం దగ్గరికి వరద జలాలు చేరుకున్నాయి.










