ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : కృష్ణా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌సిసి విద్యార్థులు నా మట్టి - నా దేశం అనే కార్యక్రమాన్ని ఆజాదీ కా అమత్ మహౌత్స వంలో భాగంగా శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎన్.సి.సి విద్యార్థులు మొక్కలను నాటి పరిసరాలను పరిశుభ్రం చేశారు.విశ్వవిద్యాలయ అసోసియేట్ ఎన్.సి.సి ఆఫీసర్ లెఫ్టినెంట్ డా. డి.రామశేఖర్ రెడ్డి విద్యార్థుల చేత పంచప్రాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ఎంతోమంది వీరుల నిస్వార్ధారహిత సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రధానోపాధ్యాయురాలు డా. ఆర్. విజయకుమారి మాట్లాడుతూ భారత ప్రభుత్వం మన దేశ అమర జవాన్లను మరియు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి దేశమంతటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని విద్యార్థులకు గుర్తు చేశారు మరియు ఇది ఆజాదీ కా అమత్ మహౌత్సవంలో చివరి కార్యక్రమంగా పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.










