- జగనన్న పేరుతో ఊర్లే కట్టిస్తున్నాం అన్నారు...
- తీరా చూస్తే వందల మంది ఇంటి స్థలాల కోసం పోరాటంలోకి వస్తున్నారు...
- కర్నాటక సిపిఎం నాయకుల విమర్శ..
ప్రజాశక్తి - చిలమత్తూరు : ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరిట కాలనీలు కట్టిస్తున్నారని పేదలు ఉన్న వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఊర్లకు ఊళ్లే ఏర్పాటు చేస్తున్నారని టీవిల్లో వైసిపి నాయకుల ఉపన్యాసాలు చూసి చాల సంతోషించామని కర్నాటక సిపిఎం నాయకులు తెలిపారు. నిజంగా ఆంద్రప్రదేశ్ లో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చారని భ్రమపడ్డామని ఈ రోజు భూస్వాదీన పోరాటంలో పాల్గొన్న వందల మందిని చూస్తే అర్థం అవుతుందన్నారు. భారత దేశంలో ఎక్కడైన పోరాటం చేసే పేదలు ఇంటి స్థలాలు దక్కించుకోవల్సిన పరిస్థితులు దాపరించారని ఆగ్రహించారు. పెట్టుబడి దారులకు పారిశ్రామిక వేత్తల కు రైతులు సాగుచేసుకున్న భూములను లాగేసుకొని దారదత్తం చేయడానికి ఏపిఐఐసి లాంటి సంస్థలు ఉన్నాయి. కాని పేదలను గుర్తించి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్లను మంజూరు చేసి కట్టించి ఇచ్చేందుకు అలాంటి సంస్థలు లేవని విమర్శించారు. ఉన్న హౌసింగ్ డిపార్ట్‌మెంట్ కూడా స్థలాలు ఉన్న వారికి తప్ప లేని దుస్థితి పట్టింకోదని అన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మాని ఇళ్లులేక తిప్పలు పడుతున్న పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేయించాలన్నారు. స్థానిక రెవెన్యూ అదికారులు బాధ్యతగా తీసుకొని పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు. వందమంది పేదల హక్కుగా ఉన్నా ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలని అన్నారు. విలువైన స్థలం పేదలకు ఇవ్వకూడదు అన్న మాట మేము ఎక్కడా వినలేదని ఇలాంటి రాజ్యంగం ఆంద్రప్రదేశ్ లో ప్రత్యేకంగా చిలమత్తూరు రెవెన్యూ అదికారులే తయారు చేశారేమో అనే అనుమానం కలుగుతుందని అన్నారు.రెవెన్యూ అదికారులు అలాంటి మాటలు చెబుతున్నారంటే మొదట అలాంటి అదికారులపై కలెక్టర్ స్థాయి అధికారులు విచారణ చేయాలని ఎందుకంటే వారికి ఏ రియాల్టర్ టచ్ లో ఉన్నాడో ఎవరికి ఈ భూమిని దారాదత్తం చేయదల్చుకున్నారో బయటపడుతుందని అన్నారు. పేదలు ఇంటి స్థలాలను చూసుకున్నారని ఇక్కడ నీరు,కరెంటు సదుపాయం కల్పించడంతో పాటు ఇళ్ల నిర్మాణాలు కట్టించాలని డిమాండ్ చేశారు. ఉధ్యమానికి మద్దతుగా కర్నాటక సిపిఎం పార్టీ నుండి ఇంటి నిర్మాణాలు కట్టించేంత వరుకు పాల్గొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కర్నాటక రాష్ట్ర నాయకులు ఓబులరాజు, అశ్వర్థనారాయణ, డిఐఎఫ్ ఐ బాషా, శ్రీ సత్యసాయి జిల్లా వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, పెనుకొండ రమేష్ ,సిపిఎం నాయకులు వెంకటేష్, రామచంద్ర, చంద్రశేఖర్, రమేష్, చందు, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.










