Oct 22,2023 23:11

కరణం వెంకటేష్‌ను పరామర్శిస్తున్న వరికూటి అశోక్‌బాబు

ప్రజాశక్తి-టంగుటూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలులో చికిత్స పొందుతున్న వైసిపి చీరాల నియోజక వర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌బాబును వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌ బాబు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వెంకటేష్‌బాబును పరామర్శించిన వారిలో వైసిపి జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, సామాజిక సేవకులు మన్నం వెంకయ్య, వైసిపి మర్రిపూడి మండల కన్వీనర్‌ దద్దాల మల్లికార్జున, వైసిపి నాయకులు తదితరులు ఉన్నారు.