ప్రజాశక్తి - మంత్రాలయం
కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ ఎస్‌ఐ సోమశేఖర్ రావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. మంత్రాలయం, నందవరం మండలాల్లో అక్రమ మద్యం అమ్మకాలు జరిపే వారి వివరాలు సేకరించి ఆకస్మికంగా దాడి చేసినట్లు తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్ర నగర్‌కు చెందిన మొండి వీరేష్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన 192 (90 ఎంఎల్) ఒరిజినల్ ఛాయిస్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నందవరం మండలం నదీ కైరవాడి గ్రామానికి చెందిన కయాడిగ పువ్వు కోర్నెలి నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన 96 (90 ఎంఎల్) ఒరిజినల్ ఛాయిస్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మద్యం ప్యాకెట్ల విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని పేర్కొన్నారు. హెడ్ కానిస్టేబుళ్లు గోపాల్, లింగ ప్రసాద్, పోలీసులు రామచంద్రుడు, నర్సింహారెడ్డి, రాధమ్మ పాల్గొన్నారు.
నిందితులను చూపుతున్న పోలీసులు










