ప్రజాశక్తి-కపిలేశ్వరపురం
భారత స్వాతంత్య్రోద్యమ లక్ష్య సాధనకోసం విద్యార్థులంతా క్రమశిక్షణతో మెరుగైన విద్యను అభ్యసించాలని సిద్ధార్థ కళాశాలల ఛైర్మన్ వాకా దివ్య శేఖర్ అన్నారు. శుక్రవారం అంగర సిద్ధార్థ కళాశాల ఆవరణలో 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని విద్యార్థులు 77వ ఆకతిలో నిలుచుని దేశభక్తిని చాటుకున్నారు. మువ్వన్నెల జెండా చేతబట్టి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతామంటూ నినాదాలు చేశారు. భారతదేశం అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చాలంటూ సిద్ధార్థ కళాశాల కరస్పాండెంట్ వాకా రాజా ఆకాంక్షించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను నిత్యం స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి.రమణ, అధ్యాపక సిబ్బంది, జూనియర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు.










