క్రికెట్‌టోర్నమెంట్ విజేత శంకరంపాడు జట్టు
ప్రజాశక్తి - గుడివాడ/నందివాడ
వెనిగండ్ల పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లపోతు వెంకట కృష్ణారావు మెమోరియల్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు విశేష స్పందన లభించిందని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు వెనిగండ్ల రాము అన్నారు. గత మూడు రోజులుగా నడుస్తున్న మండలస్థాయి క్రికెట్ టోర్నమెంటు బుధవారంనాడు ముగిసింది. వెనిగండ్ల రాము ప్రారంభించిన క్రికెట్ టోర్నమెంటులో 16టీమ్‌లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌లో శంకరంపాడు జట్టు విన్నర్ గా నిలువగా ఇలపర్రు జట్టు రన్నర్‌గా నిలిచిందన్నారు. టోర్నమెంటు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్లపోతు వెంకట కష్ణారావు భార్య విజయలక్ష్మి, కుమార్తె సునీత, శంకరంపాడు సర్పంచ్ కైలే సుబ్బారావు, తుమ్మలపల్లి సర్పంచ్ రాధాకృష్ణ, రుద్రపాక సర్పంచ్ రాజు, టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు సత్యసాయి, వెనిగండ్ల పౌండేషన్ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త తమ్మరెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎం.పి.టీ ఉప్పల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు బొర్రా సత్యనారాయణ, పర్వతనేని రాజాబాబు, పోలుకొండ సర్పంచ్ మానేపల్లి ఝాన్సీకుమార్ తదితరులు పాల్గొన్నారు.










