ప్రజాశక్తి - వీరఘట్టం : చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మండల విద్యాశాఖ అధికారులు డి.గౌర్నాయుడు, ఆర్.ఆనందరావు క్రీడాకారులకు సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో అండర్-14, 17 విభాగాల్లో మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యంతో పాటు మాసిక ఉల్లాసం ఉంటుందన్నారు. అందరూ క్రీడల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నట్లు వారన్నారు. కబడ్డీ, వాలీబాల్, కోకో, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, యోగా, త్రోబాల్, టెన్నీ కాయింటు తదితరు క్రీడ పోటీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.సుంబోరా అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేపీ నాగమణి, వ్యాయమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మజ్జి రామకష్ణ, ఆర్గనైజింగ్ సభ్యులు ఎస్.ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వి రాజేంద్ర, పద్మరాజు, సాల్మన్ రాజు, పోల్రాజు, మధు, శ్రీను, ధనలక్ష్మి, ఎస్వీ రమణతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.
సీతంపేట : మండల ఎస్‌జిఎఫ్ సెలక్షన్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మంగళవారం స్థానిక ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నిర్వహించారు. సుమారు 26 పాఠశాలల నుంచి 500మంది విద్యార్థులు పాల్గొన్నారు, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, యోగా, అథ్లెటిక్స్ క్రీడలకు ఎంపిక పోటీలు జరిగాయి. ఎంపికైన విద్యార్థులు నియోజకవర్గంలో జరుగు క్రీడలకు అర్హులు, డిడి ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ డిఇఒ ఎ.లిల్లీరాణి, ఐటిడిఎ స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకబ్ దయానంద్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో పిడిలు ఆర్‌సి రెడ్డి, వెంకట్రావు, రమణమూర్తి, ఈశ్వరరావు, సూర్యనారాయణ, నాగేశ్వరరావు, సింహాచలం, శ్రీను, కళ్యాణీ, శేఖరు, కామేశ్వరి, జగంతి తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్ : జిల్లా, మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు మంగళవారం డోకిశిల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగాయి. మంగళవారం వాలీబాల్, కబడీ,్డ ఖోఖో తదితర పోటీల్లో విద్యార్థులు పాల్గొని ఎంపిక పోటీలను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ గోవిందరావు, సర్పంచ్ ఎస్.జగదీష్, డాక్టర్ బడే ఐశ్వర్యతో పాటు వసతి గృహ సంరక్షకులు యు.రమేష్‌తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ ఎంపిక పోటీలు నిర్వహించి నియోజకవర్గం పోటీలకు 150 మంది ఎంపికయ్యారని స్థానిక వ్యాయామ సంచాలకులు ఎం.వాసుదేవ నాయుడు, పిఇటి ఇల్లు దుర్గాప్రసాద్ తెలిపారు.
వర్షంలోనే భోజనాలు
వీరఘట్టం: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు భోజనాల కోసం అవస్థలకు గురయ్యారు. అప్పటి వరకు ఎండ వేయడంతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆకాశంలో మార్పు రావడంతో సుమారు గంటసేపు వర్షం పడవడంతో మండలంలోని సుమారు 500 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. వీరికి భోజనాలు పెట్టేందుకు వంటగది సౌకర్యం లేక నిర్వాహకులు ఆరుబయట వంటలు చేశారు. అయితే సకాలంలో క్రీడాకారులకు భోజనాలు పెట్టలేకపోయారు. అలాగే భోజనం కోసం క్రీడాకారులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి చినుకు పడినప్పుడు కూడా వర్షంలోనే వంట నిర్వాహకులు ఎన్నో అవస్థల పడి క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పించారు.










