ప్రజాశక్తి-అవనిగడ్డ : జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరిం చుకొని హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా ఈనెల 29న అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో అవనిగడ్డ సబ్‌జన్ వ్యాయామ ఉపాధ్యాయులు సంఘం నిర్వహించే సబ్ జోన్ ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసే నిమిత్తం శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు తోట శ్యామ్ కిషోర్ నాయుడు రూ పదివేల విరాళం అందజేశారు. ఆదివారం శ్యామ్ కిషోర్ ఇంటి వద్ద బహుమతుల నిమిత్తం సంఘం ట్రెజరర్ మునగాల ఉదరు కుమార్ కి నగదును అందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సభ్యులు రేమాల శ్రీనివాసరావు, తోట నరసింహనాయుడు, సాయి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు










