Mar 31,2023 17:36

rally

క్రైస్తవ సోదరుల బైక్‌ ర్యాలీ
ప్రజాశక్తి-గుడివాడ
ప్రపంచ శాంతిని కోరుతూ స్థానిక ఏలూరురోడ్డులోని మౌంట్‌ కార్మెల మాత దేవాలయం(ఆర్‌సిఎం) విచారణ పరిధిలోని సుమారు 50 మంది దీక్షాపరులు గుడివాడ నుండి ఏలూరు సమీపంలోని హోలిలాండ్‌లోని దైవ సేవకుడు ఫాదర్‌ సిల్వియో పాస్క్వాలి సమాధి వద్దకు బైక్‌లతో ర్యాలీగా వచ్చారు. శుక్రవారం స్థానిక ఏలూరురోడ్డులోని ఆర్‌సిఎం దేవాలయం వద్ద విచారణ గురువు ఫాదర్‌ గుజ్జుల మైఖేల్‌, సహయగురువు ఫాదర్‌ రవికాంత్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్యారిస్‌ కమిటీ సభ్యులు, దీక్షాపరులు పాల్గొన్నారు.