Oct 18,2023 23:00

కరాటే చిన్నారులకు మిద్దెల సత్కారం

కరాటే చిన్నారులకు మిద్దెల సత్కారం
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులను వైసీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ ఆప్కో డైరెక్టరు మిద్దెల హరి బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అంతర్జాతీయ క్రీడల్లోనూ రాణించి అటు తల్లిదండ్రులకు, శ్రీకాళహస్తికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. పట్టణంలోని హరహరభావి వీధికి చెందిన కరుణాకర్‌ గుప్తా కుమార్తెలు చాతుర్యశ్రీ, మాధుర్యాశ్రీలు చెన్నైలోని సాంతొం స్కూలు లో జరిగిన సారిన్‌ రియూ అండర్‌-10,11 విభాగం కరాటే పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి బంగారు, వెండి పతకాలు కైవసం చేసుకున్నారు.