Jul 21,2023 18:55

రోడ్డుపై బైఠాయించిన జనసేన ఇన్‌ఛార్జీ వెంకప్ప, గ్రామస్తులు

ప్రజాశక్తి- దేవనకొండ
మండలంలోని కొత్తపేట గ్రామ మట్టి రహదారిపై బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీ తెర్నేకల్‌ వెంకప్ప డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆ గ్రామ రహదారి స్టేజి వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, జనసేన కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ గత మూడేళ్ల క్రితం రోడ్డు నిర్మాణం చేపడతామని భూమి పూజ చేసి గాలికి వదిలేశారని తెలిపారు. గుంతలమయమైన ఈ రహదారిపై ప్రయాణం చేసే బడిపిల్లలు, గర్భిణులు, బాలింతలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వన్ని డిమాండ్‌ చేశారు. జనసేన నాయకులు మగ్బుల్‌, బడేసాబ్‌, నందు, వీరేష్‌, మురళీ, కృప, సంజు పాల్గొన్నారు.