Sep 01,2023 20:21

పింఛన్లను పంపిణీ చేస్తున్న సర్పంచి రాధమ్మ

ప్రజాశక్తి - ఆస్పరి
అర్హులైన 16 మందికి కొత్తగా మంజూరైన పింఛన్లను సర్పంచి మూలింటి రాధమ్మ, జిల్లా కెడిసిసి డైరెక్టర్‌ రాఘవేంద్ర, సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన్‌, జడ్‌పిటిసి దొరబాబు, మండల కన్వీనర్‌ పెద్దయ్య చేతుల మీదుగా శుక్రవారం సచివాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాబోయే 2024లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రామాంజనేయులు, వైసిపి నాయకులు కేశవ రెడ్డి, తిమ్మప్ప, సచివాలయ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ బాలనాయక్‌ పాల్గొన్నారు.