ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : జిల్లా వ్యాప్తంగా కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ఎఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు ఎంఎన్‌ఒ, ఎఫ్‌ఎన్‌ఒలకు పనిచేసిన ఆరునెలల కాలానికి వేతనాలు చెల్లించకుండా యంత్రాంగం అన్యాయం చేస్తున్నారని వారు ఆందోళన బాటపట్టారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ విధుల్లో పాల్గొన్న మూడు వేల మంది ఉద్యోగులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లాస్థాయి కమిటీ ఎంపిక చేసి విధులోకి తీసుకుని ప్రమాదస్థితిలో వెట్టిచాకిరీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా అవసరం లేదంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధాక్షిణ్యంగా తొలగించారని పేర్కొన్నా రు. కార్యక్రమంలో వైద్యులు విజయభాస్కర్, బి.జ్యోతి, బి.శంకరరావు, జగదీష్, వి.మురళి, సంధ్య, రామారావు, గోపాల్, చంద్రిక పాల్గొన్నారు.










