కోటలో శాసనాన్ని పరిశీలిస్తున్న చరిత్రకారుడు మైనాస్వామి
ప్రజాశక్తి -పెనుకొండ :విజయనగర సామ్రాజ్యంలో ముఖ్య భూమిక పోషించిన పెనుకొండ కోట నిర్మాణ విశేషాలను వివరిస్తున్న ప్రాచీన శాసనాన్ని కాపాడాల ని చరిత్రకారుడు మైనాస్వామి భారత పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివా రం పట్టణంలోని పెనుకొండ చరిత్రకు మూలాధా రమైన శాసనాలు, కోట ఉత్తర ద్వార పరిసరాలను పరిశీలించారు. విజయనగర రాజ్యం, పెనుకొండ చరిత్ర రచనకు ప్రాణాధారమేగాక ప్రత్యక్ష సాక్షిగా ఉన్న శాసనం పగిలిపోయి ఉండడం, అక్కడే చెత్తకుప్ప ఉండడంతో చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట ఉత్తర ద్వార ప్రవేశం లోపలివైపున గోడ దిమ్మెపై ఉన్న ఆ శాసనానికి, కోట భాగానికి తక్షణం మరమ్మతులు చేయాలని పురావస్తు శాఖ అధికారులను కోరారు. ఈ మేరకు ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాయనున్నట్టు తెలిపారు.










