Aug 07,2023 20:13

ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ రెడ్డిని అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని కళాశాల బీసీ హాస్టల్‌లో విష పురుగు కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని కల్పన ఆరోగ్యంపై ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌ రెడ్డి ఆరా తీశారు. సోమవారం విద్యార్థిని చికిత్స పొందుతున్న మధు ఆస్పత్రిలో కల్పనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థిని కల్పన ఆరోగ్య పరిస్థితి కుదుటపడే వరకు ఆస్పత్రిలోనే ఉంటుందన్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. హాస్టల్‌ ఆవరణలో అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలోనే హాస్టల్‌ను సందర్శిస్తామని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడే వరకు చూస్తూనే ఉండాలని వార్డెన్‌ ప్రమీలకు సూచించారు. విద్యార్థిని ఆరోగ్యం పట్ల అపోహలు నమ్మవద్దని, ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వెంటిలేటర్‌ ద్వారా మెరుగైన వైద్యం అందించామని డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ రెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు.