ప్రజాశక్తి-కోడూరు : కోడూరు గ్రామ పంచా యతీ పరిధిలోని స్వతంత్రపురం గ్రామం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటలు సర్వీసును అవనిగడ్డ నియోజకవర్గం శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ఇకమీదట కోడూరు మండలంలో వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని పాము కాటు, కుక్కకా టులకు గతంలో అర్ధరాత్రి సమయాల్లో అవనిగడ్డ రావాల్సి వచ్చేదని ఇకమీదట కోడూరు మండల ప్రజలకు ఆ ఇబ్బంది లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, కోడూరు గ్రామపంచాయతీ సర్పంచ్ వెన్న షైనీ, ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి, జడ్పిటిసి యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, కోడూరు పిఎసిఎస్ అధ్యక్షులు పరిసే మాధవరావు, కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మౌనిక, ఎస్సై రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.










