ప్రజాశక్తి-సీతంపేట: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు సోమవారం కొనసాగాయి. టిడిపి పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో సంత సెంటర్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్‌టి సెల్ రాష్ట్ర కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, మండల అధ్యక్షులు సవరతోట మొఖలింగం, మండంగి ప్రకాశం, బిసి సెల్ అధ్యక్షులు ఆర్.రంగనాథం, ఎస్‌సి సెల్ అధ్యక్షులు గంట సుధా, ఐటిడిపి కోఆర్డినేటర్ హిమరక పవన్, క్లస్టర్ ఇంచార్జ్ నిమ్మక చంద్రశేఖర్, సర్పంచ్ బిడ్డిక నీలయ్య, బిడ్డిక స్వామినాయుడు, మురళి పాల్గొన్నారు.
కురుపాం : చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి టి.జగదీశ్వరి తెలిపారు. సోమవారం కురుపాంలో టిడిపి కార్యాలయం వద్ద టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ సుకేష్ చంద్ర పండా, ప్రతినిధులు కోలా రంజిత్ కుమార్, కలిశెట్టి కొండయ్య, టిడిపి నాయకులు కన్నా, నందివాడ కృష్ణబాబు, మాజీ సర్పంచ్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని లచ్చయ్యపేట చక్కెర ఫ్యాక్టరీ వద్ద టిడిపి ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజరుచంద్ర ఆధ్వర్యాన మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. బాబుకు మద్దతుగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, నాయకులు ఎస్.హరిబాబు, డి.పెద్దబ్బాయి, శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, వి.గుంపుస్వామి, వి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










