Sep 13,2023 21:46

ప్రజాశక్తి - యంత్రాంగం
         టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు బుధవారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా పలుచోట్ల ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టారు.
ఏలూరు అర్బన్‌ : రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేమనే భయంతోనే సిఎం జగన్‌ టిడిపి అధినేత చంద్రబాబుపైనా, పార్టీ నాయకులపైనా అక్రమ కేసులు పెడుతున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బడేటి రాధాకృష్ణయ్య విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా స్థానిక వసంతమహల్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. తొలుత ఈ దీక్షా శిబిరాన్ని పోలీసులు అడ్డుకుని షామియానాను తొలగించాలని చెప్పటంతో, ఆ పక్కన ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బైఠాయించి తమ నిరసన కొనసాగించారు. అయినప్పటికీ పోలీసులు కొద్దిసేపు సమయం ఇచ్చి దీక్షను ముగించాలని, ప్రభుత్వ స్థలాలలో దీక్ష చేయడానికి అనుమతి లేదని చెప్పటంతో స్థానిక చేపల తూము సెంటర్‌కు చేరుకుని అక్కడ స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన శిబిరంలో తన దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా బడేటి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ పాలన సాగుతుందని, సర్వేలన్నీ జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచే దమ్ము లేక ప్రతిపక్ష నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ద్వారకాతిరుమలలో టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయకుట్రలో భాగంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఎదుర్కోలేమనే భయంతో అక్రమ కేసులు బనాయించారన్నారు. ముందస్తు నోటీసు లేకుండా అక్రమంగా అరెస్ట్‌ చేశారని, తక్షణం ఈ కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గంటా బాబ్జీ, ఇమ్మడి రత్నాజీ, గంటా నాని, వాసిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌, కొటారు గాంధీ, కూరాకుల సత్యనారాయణ, ఏలేటి సత్యనారాయణ, నాలుగు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చాట్రాయి : చంద్రబాబు అరెస్ట్‌ అప్రజాస్వామికం, దారుణమని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం మండలంలోని చనుబండలో మోరంపూడి ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరసా శ్రీను, శెట్టి నాగరాజు, ఫిరంగి పుల్లయ్య, మొద్దు శ్రీను, విస్సంపల్లి ప్రసాద్‌, తేనేటి రాజేంద్ర, రసూల్‌, చేకు పరమేష్‌, ధర్మరాజుల వాసు, చంటిబాబు, బజ్జూరి రాజా, మిద్దె చెన్నారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉంగుటూరు : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు ఉంగుటూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారమూ కొనసాగాయి. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో ఉంగుటూరు సర్పంచి బండారు సింధు, కైకరం ఎంపిటిసి సభ్యురాలు, పలువురు మహిళలు, నాయకులు కూర్చున్నారు.
ముసునూరు : చంద్రబాబు అరెస్టుతో జగన్‌ పాలన ముగిసినట్లేనని నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ముసునూరు సెంటర్‌లో చేపట్టిన రిలేనిరహార దీక్షలో ముద్దరబోయిన మాట్లాడారు.నీ కార్యక్రమంలో గద్దే రఘుబాబు, అట్లూరి రవీంధ్ర, కొల్లి గంగారామ్‌, మెదరమెట్ల సురేంద్ర, చిలుకూరి వెంకటేశ్వరరావు, కందుల పిచ్చియ్య, కాటేపల్లి ప్రసాద్‌, సత్యనారాయణ, శ్రీనివాసరావు, గద్ధల మోహన్‌రావు, పులిబళ్ల లక్ష్మిసత్యనా రాయణ, రాపర్ల ప్రతాప్‌, గూడపాటి అజరు, కందేపు రామగిరి, సూర్యదేవర శ్రీనివాసరావు, మానం గంటేశ్వరరావు, రవీంద్ర, తల్లిబోయిన సత్యనారాయణ, పాకనాటి ఆంజన ేయులు, బుజ్జియ్య, గారపాటి నరసింహారావు పాల్గొన్నారు.
జంగారెడ్డి గూడెం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు చేపట్టిన నిరసన, రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. టిడిపి పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో సీనియర్‌ నాయకులు పలువురు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్ర శేషు, బొమ్మాజీ అనిల్‌, మండవ లక్ష్మణరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.