panchanga patanam
కొండాలమ్మ ఆలయంలో పంచాంగ పఠనం
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేమవరం గ్రామంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఉగాది సందర్భంగా అమ్మవారి అనివేటి మండపంలో బ్రహ్మశ్రీ జెపివిఎన్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు పంచాంగ ప్రతులు అందజేశారు. ఆలయ చైర్మన్ శేషం గోపి, ఆలయ కార్య నిర్వహణ అధికారి కానూరి సురేష్ బాబు, పాలకమండలి సభ్యులు పామర్తి వెంకటస్వామి, కొమ్మనబోయిన రవిశంకర్, వల్లూరు వెంకటరావు, బాడిగ లీలా సౌజన్య, నారే పాలెం వెంకట నిర్మల, డోకాల భాగ్యలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు.










