nivali arpistunna vamsi
కనికంటి కిశోర్‌బాబుకు వంశీ నివాళి
ప్రజాశక్తి-గన్నవరం( హనుమాన్‌జంక్షన్)
బాపులపాడు మండలం మడిచర్ల గ్రామ వైసిపి అధ్యక్షులు కనికంటి కిశోర్‌బాబు ఇటీవల మరణించారు. గన్నవరం శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ మంగళవారంనాడు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పార్టీ కిశోర్‌బాబు కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.










