Nov 02,2023 18:16

కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇంటూరి

ప్రజాశక్తి-కందుకూరు  కందుకూరు పట్టణంలోని 17వ వార్డు బంగారమ్మ గుడి ప్రాంతంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో లోని అంశాలను స్థానికులకు వివరించారు. వైసిపి పరిపాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు దివి శ్రీనివాసులు, నాయకులు ముట్టే రామారావు, రావి వెంకటేశ్వర్లు, అత్తంటి మాధవ, అత్తంటి మాల్యాద్రి, దివి వెంకటేశ్వర్లు, నల్లూరి సింగయ్య, అమర రామలింగయ్య, జంపాల శ్రీకాంత్‌, కాకుమాని శ్రీనివాసులు, కాకుమాని ఆంజనేయులు ఉన్నారు.