మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్ అరుణ్‌బాబు
పుట్టపర్తి అర్బన్ : వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోపా పథకం కింద జిల్లాలో 440 మందికి రూ.3.12 కోట్లు లబ్ధి చేకూరిందని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో కళ్యాణమస్తు, షాదీతోఫా పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, మున్సిపల్ ఛైర్మన్ తుంగ ఓబుళపతి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ పథం ద్వారా అందిని మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల తల్లుల ఖాతాలో జమచేసినట్లు చెప్పారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి మంజునాథ్, ఏఎస్‌డబ్ల్యూఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.










