హనుమాన్‌జంక్షన్ : కష్ణామిల్క్ యూని యన్‌కు కష్టపడి పాలుపోస్తున్న రైతు కుటుంబాలకు కల్యాణమస్తు కానుక అందజేయటం ఎంతో ఆనందంగా ఉందని విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. జంగం గూడెం పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం నందు పాలు పోస్తున్న శ్రీమతి తాతినేని శారద కుమార్తె పుష్ప వివాహం సందర్భంగా కల్మాణమస్తు పథకం కింద 20 వేల విలువచేసే బంగారునాణెంను కానుకగా చలసాని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కిలారి కిరణ్ కుమార్, సంఘ అధ్యక్షులు దోనవల్లి వెంకట సుబ్బా రావు, సంఘ కార్యదర్శి రామస్వామి, సంఘ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.










