Oct 19,2023 22:05

కల్తీ పాల నిర్వాహకుడిని పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు


ప్రజాశక్తి-దర్శి
స్థానిక పొదిలి రోడ్డులో గాంధీ నగర్‌ సమీపంలో ఓ పాలకేంద్రంలో కల్తీ జరుగుతున్నట్లు ఒంగోలు విజిలెన్స్‌ అధికారులకు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి రెండు క్యాన్ల పాలల్లో కల్తీ ఉందని గుర్తించి నిర్వాహకుడిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ ఏఎస్పీ శ్రీహర్ష తెలిపారు. దర్శిలో అప్పుడప్పుడు పది చోట్ల కల్తీ వ్యాపారం జరుగుతుందని అందిన సమాచారంతో వచ్చి పక్కాగా పట్టుకుని పుల్లారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తమకు సమాచారం తెలపాలని కోరారు. కల్తీ పాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.