Oct 28,2023 22:41

కళ్లకలక పట్ల అప్రమత్తత అవసరం

కళ్లకలక పట్ల అప్రమత్తత అవసరం
డాక్టరు రాజ్‌ యశ్వంత్‌
ప్రజాశక్తి- తిరుపతి సిటి: సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి కళ్లే కెమెరాలు. వాటి తోనే ప్రపంచాన్ని చూడగలం. సున్నితమైన ఈ అవయవాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ కంటి వైద్యనిపుణులు డాక్టరు వి.రాజ్‌ యశ్వంత్‌ తెలిపారు. 'ప్రజాశక్తి'తో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వల్ల కంటి జబ్బులు వ్యాపిస్తున్నాయని, అందులో కళ్లకలక ప్రతి ఒకరిని ఇబ్బందిలకు గురి చేస్తోందన్నారు. చిన్న, పెద్ద, ఆడా, మగా అని తేడా లేకుండా ఏ వయస్సు వారికైకనా కళ్లకలక వస్తుందన్నారు. దీన్ని అశ్రద్ధ చేయకుండా కంటి వైద్యున్ని సంప్రదించి, సరైన మందులు వాడి, కళ్లను కాపాడుకోవాలన్నారు.
కంటి జాగ్రత్తలు
కళ్లు మనిషికి చాలా ప్రధానమైనవి. అంధాకారమైన జీవితం ఊహించడానికి కూడా సాహసించరు. కళ్లను మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి.
చదివేటప్పడు : పుస్తకం 30 సెం.మీ దూరంలో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చోని చదవాలి. పడుకొని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి. కదులుతున్న కుర్చీలో కుర్చోని చవితే కళ్లకు శ్రమ కలుగుతుంది.
టివి చూస్తున్నడప్పడు : ఒక గంటకు మించి టీవి చూడడం మంచిది కాదు. టీవి చూస్తున్నప్పడు శరీరాన్ని పలు రకాలుగా భంగిమల్లో ఉంచడం చాలా మందికి అలవాటు, అయితే వెన్నముకకి ఊతమిచ్చే కుర్చీలో కూర్చోని టీవి చూడడం కంటికి మేలు చేస్తుంది. చీకటిగా ఉన్న గదిలో కూర్చోని టీవి చూడకుడదు. టీవి చూస్తున్నప్పడు వెలుతురు సరిపడా ఉండాలి. లైట్లు కూడా టీవి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.
కంప్యూటర్‌తో పని చేస్తున్నప్పడు: కంప్యూటర్‌ తెర మధ్య భాగానికిక కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది. రెప్ప వేయకుండా పని చేయడం మంచిది కాదు. తరుచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. నిరంతరం పని చేయకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. కాళ్లు నేలమీద ఆన్చి వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. మీ దృష్టి మరీ అంత తీక్షణంగా ఉండకుడదు. మరింత కాంతివంతంగా కనిపించేలా మానిటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. మానిటర్‌ మీద యాంటిగ్లేర్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిది. మీరు ఎక్కువుగా కంప్యూటర్‌ ముందు పనిచేసేవారైతే మీ కళ్లు ఎక్కువుగా అలసటకు గురవుతాయి. ఆ సమయంలో ఈ 20-20-20 రూల్స్‌ని పాటించండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మీరు బ్రేక్‌ తీసుకుని కంప్యూటర్‌ని కాకుండా 20 మీటరుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్లు పాటు చూడండి. ఇదే 20-20-20 రూల్‌, ఇది కల్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
బండినడిపేటప్పడు : బండి నడిపేటప్పడు సన్‌గ్లాసెస్‌ని వాడాలి. సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోమిత కిరణాలు యువి కిరణాలు తాకిడికిక కళ్లకు హాని కలగకుండా, దుమ్మి, దూళి పడకుండా కళ్లకు రక్షణగా ఉంటాయి. రాత్రులు బండి నడిపేటప్పడు యాంటి గ్లేర్‌గ్లాస్లు వాడాలి. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్ల కాంతిని తగ్గించి కల్లకు రక్షణ కల్పిస్తాయి.
కొన్ని కంటి వ్యాయామాలు
- తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి ఉంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ పక్క నుంచి ఆ పక్కకు, ఆ పక్క నుంచి ఈ పక్కకు తిప్పాలి.
- తలను విశ్రాంతిగా ఉంచి చూపును సవ్యదిశ లోను, అపసవ్య దిశలోనూ, తిప్పాలి, ఇలా 3 సార్లు చేయాలి.
- తలను ఏ మాత్రం కదల్చకుండానే వీలైన పైకి, మళ్లీ వీలైనంత కిందకి చూడాలి.
- తలను నిటారుగా ఉంచి చూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుంచి చూడండి, అలాగే చూపును కిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.
- మన కంటిలో 6 కండరాలు ఉంటాయి. ఇవి కన్ను గుడ్డును కదల్చడానికి సహయపడుతాయి. కన్నుగుడ్డు కదలడానికి కంటిలోని 6కండరాలు సహకరించాలంటే ఈ వ్యాయామాలు చేయాలి. కంటి సమస్యలను అశ్రద్ధ చేయకుండా వైద్యులను సరైన సమయంలో సంప్రదించి, కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైన కళ్ల సమస్య ఉన్న వారు అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్న యష్‌ హాస్పిటల్‌ను, 0877 2238714 ఫోన్‌ నెంబరును సంప్రదించాలని సూచించారు.