ప్రజాశక్తి-కలక్టరేట్ (కష్ణా) : కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎన్‌ఐసి విభాగంలో గురు వారం విష సర్పం కలకలం సష్టించింది. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు భయం దోళనకు గురైయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ వెనుక ఉన్న పొదల్లో నుండి కిటికీ ఎక్కి ఎన్‌ఐసి ఛాంబర్‌లోకి రావడంతో అప్పటికే విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులు అందరు ఒక్కసారిగా బయటకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.దీంతో స్పందించిన అధికారులు పాములు పట్టే వ్యక్తిని పంపించడం తో అతను వచ్చి పామును పెట్టుకోవడంతో ఉద్యోగులందరూ ఊపిరి పీల్చుకున్నారు.










