Jul 07,2023 19:57

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి పురుషోత్తమరెడ్డి

       చిలమత్తూరు:నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైసిపి జెండా ఎగురవేసేలా కృషి చేయాలని ఎంపిపి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. చిలమత్తూరు మండల కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో శుక్రవారం నాడు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో హిందూపురం నియోజకవర్గం వైసిపి ఇన్‌ఛార్జి దీపిక భర్త వేణురెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇకపై గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టి అందరూ ఒకతాటిపై నడుద్దామన్నారు. వైసిపి అదిష్టానం నిర్ణయించిన వ్యక్తి గెలుపుకోసం ప్రతి ఒక్కరు కషి చేయాలన్నారు. ఈ ఆదివారం దీపిక చిలమత్తూరుకు రానున్న నేపథ్యంలో ఆమెకు వైసిపి శ్రేణులు ఘనస్వాగతం పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సమన్వయ కర్త దీపిక భర్త వేణురెడ్డి, సర్పంచి సంధ్య, తిరుమలేష్‌, మురళీ, లక్ష్మిపతిరెడ్డి, ఎంపిటిసిలు మంజునాథ్‌ రెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.