Jul 09,2023 21:17

దీపికకు ఘన స్వాగతం పలుకుతున్న నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం :నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నా వైసిపి కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి జగనన్నకు బహుమతి గా ఇద్దామని నూతన సమన్వయకర్త దీపిక తెలిపా రు. వైసిపి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన దీపిక తొలిసారిగా ఆదివారం హిందూపురం రాగా స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో కర్నాటక సరిహద్దుకు చేరుకున్నారు. తూముకుంట చెక్‌ పోస్టు వద్దకు వచ్చిన దీపికకు పుష్పగుచ్ఛాలు అందజేసి, టపాసులు పేల్చి ఘనం గా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దీపిక గొర్రె పిల్ల ఎత్తి నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేశా రు. అనంతరం అక్కడి నుంచి వేలాది మందితో కలి సి ద్విచక్ర వాహన ర్యాలీగా హిందూపురం పట్టణం చేరుకుని పరిగి బస్టాండ్‌లో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహా నికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ చేరుకుని అక్కడ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి నాయకులందరినీ నేరుగా కలిసి సహకరించాలని కోరి అందరినీ కలుపుకొని ప్రణాళికాబద్దంగా ముం దుకు సాగు తామన్నారు. ర్యాలీలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వేణురెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి హనుమంతరెడ్డి, కౌన్సిలర్లు మారుతిరెడ్డి, శివ, ఆసిఫ్‌, డిష్‌ నాగరాజు, వెంకటేష్‌రెడ్డి, మహేష్‌ గౌడ్‌, రామచంద్ర, నాగేంద్ర బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.