ప్రజాశక్తి-అనంతపురం రాజకీయ కక్షతోనే టిడిపి అధినేత నారా చంద్రబాబును అరెస్టు చేశారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్ విమర్శించారు. శనివారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లోని జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిందన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజల్లో తిరగకుండా అణిచివేయాలన్న కుటిల దుర్భుద్ధితో ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అక్టోబర్‌లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పట్ల కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించారన్నారు. ప్రశ్నించేవారిని జైల్లో పెట్టడం వైసిపికి ఆనవాయితీగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజల్లో తిరిగితే చాలు ఏదో ఒక నెపం మోపి అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తామంటే పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకోరన్నారు. నేడు జరిగే జనసేన పిఎసి సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణతో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న వైసిపి మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మర నాగేంద్ర, కార్యదర్శులు జయమ్మ, అవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, రోళ్ల భాస్కర్, వెంకటనారాయణ, నగర కార్యదర్శులు అంజి, వడ్డే వెంకటేష్, వెంకటరమణ, ఆకుల అశోక్, ఆకుల ప్రసాద్, వీర మహిళ దాసరి సరిత, నాయకులు హిద్దు, సల్మాన్, చిన్న, మధు, షామీర్ తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న జనసేన జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్










