ప్రజాశక్తి - ఆదోని
టిడిపి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తున్నారని, ఇలాంటి పద్ధతి మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని నిర్మల్ థియేటర్, ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద దీక్ష శిబిరం నిర్వహించారు. దీక్ష శిబిరం దగ్గర ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు జైలులో పెట్టించడం జగన్మోహన్ రెడ్డికి తగదని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్‌కు బుద్ధి మారాలని కోరారు. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ... 18 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల పద్ధతుల్లో నిరసనలు చేసినా జగన్మోహన్ రెడ్డి గమనించకపోవడం దుర్మార్గమైన చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు విజువల్ బాషా, ఖాద్రీ, అలీ సాహెబ్, మసీద్ మామ, అప్సర్ బాష, అల్తాఫ్, జాఫర్, అరిఫ్, ఇంతియాజ్, ఫక్రుద్దీన్, మాబాష, పీరా, రసూల్ పాల్గొన్నారు.
నమాజ్ చేసి నిరసన తెలుపుతున్న ముస్లింలు










