ప్రజాశక్తి - దేవనకొండ
ప్రజలపై భారాలు వేస్తూ ప్రజాకంటకంగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సమరభేరి మోగిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు. బుధవారం సిఐటియు కార్యాలయంలో సమరభేరి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్, మండల నాయకులు సూరి మాట్లాడారు. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించే సమరభేరిని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర మంచి చేస్తాయనే ఆశతో పేదలు ఓట్లు వేసి గెలిపిస్తే పేదలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. రోజురోజుకు ఆకాశన్నంటుతున్న ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, రాష్ట్రంలో ప్రత్యేకంగా విద్యుత్ చార్జీల పెంపు పేదలకు పెనుభారంగా మారుతున్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టే సమరభేరి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. వై.రంగన్న, రాయుడు, కుమార్, రాముడు, మహేంద్ర, మహేష్ పాల్గొన్నారు. ఆదోని (రూరల్) మండలంలోని మదిరె గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న మాట్లాడారు. ఈనెల 30, 31 గ్రామాల్లో సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1, 2న గ్రామ సచివాలయాల ఎదుట ఆందోళన, 5న సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం మండల నాయకులు చిన్న తిక్కన్న, శాఖ కార్యదర్శి శ్రీనివాసులు, పార్టీ సభ్యులు ఈరన్న, కుమారప్ప, జలంధర్, నడిపి మూకన్న, హనుమంతు పాల్గొన్నారు. ఆదోనిలోని సుందరయ్య భవన్‌లో సమరభేరి కరపత్రాలను విడుదల చేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సీనియర్ నాయకులు ఈరన్న, కార్యదర్శి వర్గసభ్యులు గోపాల్, తిప్పన్న పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ, సంతకాలు సేకరణ చేపట్టారు. పట్టణ కమిటీ సభ్యులు వీరేష్, వెంకటేష్, నాగరాజు, నాగేంద్ర, నాయకులు రామానాయుడు, అంజి, శివ, రామాంజి, మెహన్, భీమా పాల్గొన్నారు.










