ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం మండలంలోని కేదారిపురం గ్రామ పంచాయతీలో జోబుగూడ, వేపమానుగూడ, కెడి కాలనీ, సెంటర్‌గూడ, సీమలగూడలో మహాశక్తి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇందులో మహిళా సంక్షేమం కోసం టిడిపి మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. మహాశక్తి కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోను వివరిస్తున్నట్లు ఆమె తెలిపారు. నాలుగున్నరేళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షులు కడ్రక కళావతి, నాగవేణి, క్లస్టర్ ఇంచార్జ్ వెంకట్రావు తదితరులు ఉన్నారు.
కుడ్డపల్లిలో భవిష్యత్తు గ్యారెంటీ
సీతంపేట : మండలంలోని కుడ్డపల్లి పంచాయతీ పరిధిలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ మహిళలకు భద్రత, భరోసా ఆర్థిక అండ ఇవ్వగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, సీనియర్ నాయకులు నిమ్మక నాగేశ్వరావు, నిమ్మక కృష్ణ, సింహాద్రి, ఊయక నారాయణ, పాలక సింహాచలం, బిడ్డిక నారాయణ, జీలకర్ర దిలీప్ కుమార్, చిన్నారావు, ఆరిక కూర్మారావు, స్థానిక మహిళా నాయకులు పాల్గొన్నారు.










