Apr 24,2023 22:53

కదిరిలో కుండపోతగా కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : భానుడి భగభగలు ఎండ వేడిమి ఉక్కపోతతో రెండు నెలలపాటు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో సోమవారం రాత్రి కదిరి పట్టణంలో 8 గంటల నుండి వర్షం ప్రారంభమై దాదాపు గంటకు పైగా ఉరువులు మెరుపులతో కూడిన భారీ వర్షం ఏకధాటిగా కురిసింది. దీంతో వీధులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. తొలకరి వర్షం పులకరించడంతో ఎండ వేడి వడగలుపుల నుండి కాస్త ఉపశమనం లభించిందని ప్రజలు ఆనంద వ్యక్తం చేశారు