May 02,2023 09:36

డీఎస్సీ ఎం.శ్రీలత

         కదిరి టౌన్‌ : కదిరి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీగా ఎం.శ్రీలత సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న డీఎస్పీ భవ్య కిషోర్‌ బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో రాజమండ్రి సౌత్‌ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీలత వచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన తనకు ఈ ప్రాంత సమస్యలు తెలుసున్నారు. డివిజన్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు కోసం పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు.