Nov 02,2023 17:51

అఖిలను అభినందిస్తున్న దృశ్యం

అఖిలను అభినందిస్తున్న దృశ్యం
కబడ్డీ పోటీల్లో రాణించిన అఖిల
ప్రజాశక్తి-కావలి :ఆటలు ఆత్మ స్థైర్యాన్ని పెంచుతాయని డి.బి.ఎస్‌ కళాశాల కరస్పాండెంట్‌ దామిశెట్టి సుధీర్‌ నాయుడు పేర్కొన్నారు. బుధవారం తిరుపతి పట్టణంలోని శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్మించిన యూనివర్సిటీ స్థాయి కబడ్డీ పోటీలలో డి. బి. ఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో తతీయ సంవత్సరం చదువుతున్న నెల్లూరు జిల్లా ,మైపాడు గ్రామానికి చెందిన జి. అఖిల అనే విద్యార్థిని తన ఆట తీరును ప్రదర్శించి,యూనివర్సిటీ స్థాయి క్రీడల్లో డి.బి.ఎస్‌. కీర్తి పథకం ఎగరవేయటం గర్వించదగిన విషయమన్నారు. ఈ సందర్బంగా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆమెను జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్దామని ఉద్బోధించారు. క్రీడలు మానసిక ఉల్లాసం కోసం ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌. టి.వి. రావు మాట్లాడుతూ అన్ని రంగాలలో విద్యార్థినులు ముందంజలో ఉన్నారన్నారు. ఆటల్లోనూ అద్భుతంగా రాణిస్తున్న తమ కళాశాల విద్యార్థిని జి.అఖిలను అభినందించారు.
కార్యక్రమంలో కళాశాల ఎఒ జి. రమేష్‌ బాబు, కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ దాసరి. శివసాగర్‌ కుమార్‌, డిప్లమా ఫిజికల్‌ డైరెక్టర్‌ బి. రాంబాబు అన్ని విభాగ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.